News5th Sep 01:17 PMSunil Byrisetty1 min read

న్యాయమూర్తుల కొరత – మీడియేషన్‌ అవసరం

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో 650 మంది జడ్జిలు ఉన్నప్పటికీ, కేసులను వేగంగా పరిష్కరించడానికి మరో 800 మంది న్యాయమూర్తులు అవసరమని

న్యాయమూర్తుల కొరత – మీడియేషన్‌ అవసరం
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో 650 మంది జడ్జిలు ఉన్నప్పటికీ, కేసులను వేగంగా పరిష్కరించడానికి మరో 800 మంది న్యాయమూర్తులు అవసరమని తెలిపారు. వివాదాల పరిష్కారంలో మీడియేషన్‌ కీలకమని పేర్కొంటూ, దీనికి నిపుణులను తయారు చేయడానికి 40 గంటల ప్రత్యేక శిక్షణ అవసరమని అన్నారు. మీడియేషన్‌ చేసే వారికి నైపుణ్యం కొలిచే ప్రత్యేక సర్టిఫికేషన్‌ ఉండాలని సూచించారు. ఆర్బిట్రేషన్‌ రంగంలో విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు కూడా వస్తున్నారని, అయితే హానెస్ట్‌ మరియు డిస్హానెస్ట్‌ ఆర్బిట్రేటర్లు ఉన్నందున దీనికి ప్రత్యేకమైన యంత్రాంగం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh news
AP High Court
Justice Dheeraj Singh Thakur
Judges Shortage
Mediation in Disputes
Arbitration న్యాయ పరిపాలన
న్యాయమూర్తుల కొరత
Scroll for the next article