News8th Jun 07:38 PMSunil Byrisetty1 min read
పేదల ఇళ్ళకు వెంటనే పట్టాలివ్వాలి
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకుని నివాసముంటున్న పేదలకు వెంటనే జిఓ 30 ప్రకారం పట్టాలివ్వాలని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం పేదలకు అందిస
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకుని నివాసముంటున్న పేదలకు వెంటనే జిఓ 30 ప్రకారం పట్టాలివ్వాలని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం పేదలకు అందిస్తానన్న ఇంటి స్థలాలు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పేదలకు ఇళ్లు ఇచ్చే అంశంపై జివో 30ను జనవరిలో ప్రభుత్వం విడుదల చేసిందని, ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. అభ్యంతరకరమైన ప్రభుత్వ భూముల్లో నివాసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు అందించి క్రమబద్ధీకరిస్తామని జివో 30లో పేర్కొన్నారు. నెల రోజుల్లో ఇళ్లు కేటాయిస్తామన్న ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం ఇంటింటికి ప్రచారం చేయకపోగా, ప్రజలే దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. ప్రతి మండలంలో భూ సలహా కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని, 5 నెలలు గడిచినా ఇప్పటి వరకు నియమించలేదన్నారు.