Politics8th Jul 02:37 PMSunil Byrisetty1 min read

నల్లపురెడ్డిని సస్పెండ్ చేయాలి: హోం మంత్రి అనిత

వైసీపీ గురించి మాట్లాడటానికి మేము సిగ్గుపడుతున్నామని హోం మంత్రి అనిత అన్నారు. మహిళా ఎమ్మెల్యే గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అలా మాట్లాడడం దుర్మార్గమన్నారు. ప్రసన్నకు

నల్లపురెడ్డిని సస్పెండ్ చేయాలి: హోం మంత్రి అనిత
వైసీపీ గురించి మాట్లాడటానికి మేము సిగ్గుపడుతున్నామని హోం మంత్రి అనిత అన్నారు. మహిళా ఎమ్మెల్యే గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అలా మాట్లాడడం దుర్మార్గమన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడిన వీడియో తల్లి, భార్య, బిడ్డలకు చూపించగలరా అని ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్‌ని జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారని మండిపడ్డారు. వైసిపీ మహిళా నాయకులు ప్రసన్నకుమార్ రెడ్డి మాటలను హర్షిస్తారా? వైసీపీలో మహిళలకు గౌరవం లేదని, ప్రసన్న కుమార్‌ను వైసీపీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి నేరప్రవృత్తి గురించి ప్రజలు ఆలోచించాలన్నారు. జగన్ వెంటనే ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, మహిళల గౌరవాన్ని కాపాడాలని అన్నారు.
Andhra Pradesh news
Ap politics
home minister anitha
Nallapareddy Prasanna Kumar Reddy
Ys jagan
YCp
suspend
women attack
నల్లపురెడ్డిని సస్పెండ్ చేయాలి హోం మంత్రి అనిత
Scroll for the next article