News4th Apr 12:28 PMSunil Byrisetty1 min read

రామానాయుడు స్టూడియోకు షోకాజ్

ఏపీలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు గతంలో కేటాయించిన భూములు పక్కదారి పట్టాయి. ఆంధ్రాలోనూ సినీ షూటింగులకు అనుకూల ప్రాంతాలు అనేకం ఉండటంతో కొందరు పెద్దలు ప్రభుత్వం ద్వారా భూములు త

రామానాయుడు స్టూడియోకు షోకాజ్
ఏపీలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు గతంలో కేటాయించిన భూములు పక్కదారి పట్టాయి. ఆంధ్రాలోనూ సినీ షూటింగులకు అనుకూల ప్రాంతాలు అనేకం ఉండటంతో కొందరు పెద్దలు ప్రభుత్వం ద్వారా భూములు తీసుకున్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నా వాటిలో ఎలాంటి షూటింగ్ వ్యవహారాలు చేయకపోగా, వాటిని వేరే విధంగా వినియోగిస్తున్నారు. దీంతో డా. దగ్గుబాటి రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాల అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూకేటాయింపు రద్దు చేయాలని నిర్ణయించి, రామానాయుడు స్టూడియోకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సినిమా స్టూడియో నిర్మాణం, అనుబంధ రంగ అవసరాల కోసం మాత్రమే కేటాయించిన 34.44 ఎకరాల భూమి వాడాల్సి ఉండగా అందులో 15.17 ఎకరాలను ఇళ్ల లేఅవుట్‌కు ఉపయోగించటం జరిగింది. స్టూడియోకి కేటాయించిన భూమిని రియల్ ఎస్టేట్‌కు వాడాలని చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Visakhapatnam
Ramanaidu
Ramanaidu Studio
డా. దగ్గుబాటి రామానాయుడు
షోకాజ్ నోటీసులు
Scroll for the next article