National13th Nov 04:40 PMSunil Byrisetty1 min read
ఢిల్లీ పేలుడుతో.. అల్ ఫలా వర్సిటీకి షోకాజ్
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో అల్ ఫలా విశ్వవిద్యాలయానికి నోటీసులు జారీ అయ్యాయి. వర్సిటీకి చెందిన కొందరు వైద్యులు అనుమానితులుగా ఉండటంతో ఈ విశ్వవ
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో అల్ ఫలా విశ్వవిద్యాలయానికి నోటీసులు జారీ అయ్యాయి. వర్సిటీకి చెందిన కొందరు వైద్యులు అనుమానితులుగా ఉండటంతో ఈ విశ్వవిద్యాలయం వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే, నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) ఈ విశ్వవిద్యాలయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అల్ ఫలా విశ్వవిద్యాలయం తమ వెబ్‌సైట్‌లో గుర్తింపునకు సంబంధించి తప్పుడు సమాచారం పొందుపరిచినందుకు న్యాక్ ఈ చర్య తీసుకుంది. న్యాక్ గుర్తింపు లేకుండా, లేదా అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండానే, అల్ ఫలా విశ్వవిద్యాలయం తమ కళాశాలకు గుర్తింపు ఉన్నట్లుగా వెబ్‌సైట్‌లో బహిరంగంగా ప్రదర్శించిందని, ఇది పూర్తిగా తప్పని న్యాక్ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ చర్య ప్రజలను, ముఖ్యంగా తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పుదారి పట్టించడమేనని తెలిపింది.