News10th Jan 03:49 PMSunil Byrisetty1 min read

పండుగకు పలకరించనున్న వర్షాలు

సంక్రాంతి పండుగ వర్షాలు తీసుకొస్తోంది. పండుగ పూట ఏపీ ప్రజలను వర్షాలు పలకరించనున్నాయి. పండుగ రోజుల్లో వర్షాలు, ఈదురు గాలులు, సముద్రం అలజడి వంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతా

పండుగకు పలకరించనున్న వర్షాలు
సంక్రాంతి పండుగ వర్షాలు తీసుకొస్తోంది. పండుగ పూట ఏపీ ప్రజలను వర్షాలు పలకరించనున్నాయి. పండుగ రోజుల్లో వర్షాలు, ఈదురు గాలులు, సముద్రం అలజడి వంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం ఉందని.. ఒకవేళ పరిస్థితులు మారితే తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం మీదుగా కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం.. పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.
Andhra Pradesh
Sankranti
Rain Forecast
Weather Department
Cyclone Warning
Coastal Andhra
Rayalaseema
Strong Winds
దక్షిణ కోస్తా
రాయలసీమ
విశాఖపట్నం
మచిలీపట్నం
కాకినాడ
నిజాంపట్నం
కృష్ణ జిల్లా పోర్టులు
దక్షిణ భారతదేశ వాతావరణం
Scroll for the next article