Spiritual14th Aug 12:20 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిపై శ్రావణ వేడుకలు!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస కళ నెలకొంది. శ్రావణ మాసంలో తొలి శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో అ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస కళ నెలకొంది. శ్రావణ మాసంలో తొలి శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో అమ్మవారి సన్నిధి భక్తజనసంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఆగస్టు 21న శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైన 'వరలక్ష్మీ వ్రతం' ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 27, 28, 29 తేదీల్లో అమ్మవారి ఆలయూలో త్రిదినాల పాటు అత్యంత పవిత్రంగా 'పవిత్రోత్సవాలు' జరగనున్నాయి. సెప్టెంబర్ 4న అమ్మవారి సన్నిధిలో భక్తుల కోసం 'సామూహిక వరలక్ష్మీ వ్రతాలు' నిర్వహించనున్నారు. శ్రావణ మాసం ముగిసే వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తగిన క్యూలైన్లు, ప్రసాద వితరణ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు.