National17th Aug 01:35 PMSunil Byrisetty1 min read

స్వదేశానికి శుభాంశు శుక్లా.. ఘన స్వాగతం.!

అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర సైన్స్ అండ్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర స

స్వదేశానికి శుభాంశు శుక్లా.. ఘన స్వాగతం.!
అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర సైన్స్ అండ్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా స్వాగతం పలికారు. ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయ వ్యోమగామిగా శుభాన్షు శుక్లా నిలిచారు. భారత్‌ చేరుకున్న శుక్లా ముందుగా ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంటారు. అనంతరం, సొంతూరు లక్నోకు బయలుదేరి వెళతారు. తర్వాత అక్టోబర్‌లో మొదలయ్యే గగన్‌యాన్‌ మిషన్‌ శిక్షణలో పాల్గొంటారు. కాగా, హూస్టన్‌లోని భారత కాన్సులేట్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో శుక్లాతోపాటు వ్యోమగామిగా ఎంపికైన ప్రశాంత్‌ నాయర్‌ కూడా పాల్గొన్నారు.
India news
Shubhanshu Shukla Indian astronaut space hero International Space Station Jitendra Singh Rekha Gupta ISRO Chairman National Space Day
స్వదేశానికి చేరుకున్న స్పేస్ హీరో శుభాంశు శుక్లా
స్వాగతం పలికిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
Scroll for the next article