News1st Sep 11:45 AMSunil Byrisetty1 min read

విజయవాడ-అమరావతి మధ్య సిగ్నేచర్ బ్రిడ్జి

రాజధాని అమరావతి, విజయవాడల మధ్య రాకపోకలను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ కృష్ణానద

విజయవాడ-అమరావతి మధ్య సిగ్నేచర్ బ్రిడ్జి
రాజధాని అమరావతి, విజయవాడల మధ్య రాకపోకలను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ కృష్ణానదిపై అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.1,000 కోట్ల వ్యయ అంచనాతో ప్రతిష్టాత్మక సిగ్నేచర్ బ్రిడ్జి ’ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు డీపీఆర్ తయారీకి ప్రభుత్వం ప్రాథమిక అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదిత సిగ్నేచర్ వంతెనను విజయవాడ ప్రకాశం బ్యారేజీ , రైల్వే వంతెనల మధ్య ప్రాంతంలో నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. సుమారు 1.10 కిలోమీటర్ల పొడవునా, ఆరు లేన్ల విశాలమైన రహదారితో ఈ వంతెన నిర్మాణం జరగనుంది. వంతెన ఇరువైపులా కాలినడకన వెళ్లే వారి కోసం ఫుట్‌పాత్‌లు, పర్యావరణ హిత ప్రయాణాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. నది అందాలను తిలకించేలా ఆధునిక లైటింగ్, ప్రత్యేక వ్యూ పాయింట్లతో ఈ వంతెనను డిజైన్ చేస్తున్నారు.
Andhra Pradesh
Vijayawada
Amaravati
Signature Bridge
Krishna River
Prakasam Barrage
Amaravati Capital
Vijayawada Amaravati Connectivity
Bridge Construction
రోడ్డు మౌలిక వసతులు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
అమరావతి అభివృద్ధి
విజయవాడ అభివృద్ధి
Scroll for the next article