News14th Dec 12:53 PMSunil Byrisetty1 min read
ఎంమహిళల్లో మౌనం బలహీనత కాకూడదు
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన 4.0 కార్యక్రమ
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన 4.0 కార్యక్రమంను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డి.ఆర్.డి.ఏ సౌజన్యంతో తుళ్ళూరులో నిర్వహించారు. నయీ చేతన 4.0 కార్యక్రమంలో భాగంగా సి.ఆర్.డి.ఎ స్కిల్ హబ్ భవనంలో
జెండర్ రిసోర్స్ సెంటర్ (GRC) ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రైవేటు పాఠశాలలో జరిగిన సభను, ప్రదర్శన శాలలను మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ మాట్లాడుతూ వివక్ష తగ్గించడం నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
దేశంలో 4.50 లక్షల గృహ హింస కేసులు నమోదు అయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ వివక్షతకు గురి అవుతున్నట్లు అంచనా ఉన్నప్పటికీ అన్ని కేసులు నమోదు కావడం లేదని చెప్పారు.
హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఇదే ప్రాంతంలో రాజధాని ఉండాలని మహిళలు పోరాటం చేసిన నేల అన్నారు. కుటుంబం బాగుండాలంటే మహిళ అండగా ఉండటమే కారణం అన్నారు.