Spiritual10th Sep 11:05 AMSunil Byrisetty1 min read

దసరాకు అమ్మవారికి పట్టువస్త్రాలు

దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనెల 29న (సోమవారం), మూల నక్షత్రం రోజున, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారు, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార

దసరాకు అమ్మవారికి పట్టువస్త్రాలు
దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనెల 29న (సోమవారం), మూల నక్షత్రం రోజున, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారు, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారల దేవస్థానానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజున సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4:30 గంటల మధ్య పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.20,000/- లు మంజూరు చేసింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
Andhra Pradesh
Dasara
Kanaka Durga Temple
Durga Malleswara Swamy Temple
Silk Cloth Offering
Government Event
CM Chandrababu Naidu
విజయవాడ
కనకదుర్గమ్మ దేవస్థానం
పట్టు వస్త్ర సమర్పణ
Scroll for the next article