Spiritual17th Sep 03:32 PMSunil Byrisetty1 min read

"కాణీపాకం వినాయక స్వామికి పట్టువస్త్రాలు సమర్పణ "

కాణీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్బంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నుండి ఈరోజు పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానానికి

"కాణీపాకం వినాయక స్వామికి పట్టువస్త్రాలు సమర్పణ "
కాణీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్బంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నుండి ఈరోజు పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానానికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), కార్యనిర్వాహణాధికారి వి.కె.శీనానాయక్, అర్చకులు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్,వైదిక కమిటీ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. చైర్మన్, కార్యనిర్వాహణాధికారి, సిబ్బందికి కాణీపాకం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పెంచల కిషోర్ స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు లింగంబొట్ల దుర్గా ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు కోట రవి కుమార్, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాస శాస్త్రి, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Kanipakam
Kanipakam Vinayaka Swamy
Kanipakam Temple
Kanipakam Brahmotsavams
Brahmotsavam
Vijayawada
పట్టువస్త్రాలు
ఆలయ వార్తలు
ఏపీ ఆలయ వార్తలు
ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు
హిందూ దేవాలయాలు
Scroll for the next article