Spiritual27th Sep 02:07 PMSunil Byrisetty1 min read
కనక మహాలక్ష్మి దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పణ
దసరా నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి విశాఖపట్నంలో కొలువై ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మ వారి దేవస్థానం తరపున దేవస్థానం కార్య ని
దసరా నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి విశాఖపట్నంలో కొలువై ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మ వారి దేవస్థానం తరపున దేవస్థానం కార్య నిర్వహణ అధికారి కె. శోభారాణి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించే ఈ సత్సాంప్రదాయం కొనసాగాలని చెప్పారు. ఇంద్రకీలాద్రి భక్త జనసంద్రంగా మారినా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగాన్ని అభినందించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.