Spiritual28th Jul 04:09 PMSunil Byrisetty1 min read
ఆహా గిరి ప్రదక్షిణ.. రెండు కళ్లు చాలవు!
విశాఖపట్నంలోని సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి కొండ చుట్టూ గిరిప్రదర్శన చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అప్పన్న తొలిపావంచ వ
విశాఖపట్నంలోని సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి కొండ చుట్టూ గిరిప్రదర్శన చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అప్పన్న తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి భక్తులు ప్రదక్షిణ చేస్తున్నారు. మొత్తం 32 కిలోమీటర్ల మేర కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి, అనంతరం సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుంటారు. ఈసారి 10 లక్షల మందికిపైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని అంచనా. ఆలయానికి వస్తున్న భక్తుల కోసం ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించింది. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ప్రతిఏడాది ఆషాఢ పౌర్ణమి పర్వదినం సందర్భంగా అంత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యాత్రలో కొండచుట్టూ దాదాపు 32 కిలోమీటర్లు భక్తులు పాదయాత్ర చేస్తారు.