News2nd Jul 03:13 PMSunil Byrisetty1 min read

జగన్‌ను కలిసిన సింగయ్య కుటుంబ సభ్యులు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, కుమారులు, కుటుంబ సభ్యులు కలిశారు. ఇటీవల జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా జ

జగన్‌ను కలిసిన సింగయ్య కుటుంబ సభ్యులు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, కుమారులు, కుటుంబ సభ్యులు కలిశారు. ఇటీవల జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. సింగయ్య కుటుంబానికి ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీరూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేసింది. బుధవారం వైసీపీ కార్యాలయంలో తనను కలిసిన సింగయ్య కుటుంబానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని జగన్‌ భరోసానిచ్చారు. వైయస్‌ జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌ ఉన్నారు.
Andhra Pradesh news
Ap politics
Ycp
singayya incident
singayya wife
వైఎస్‌ జగన్‌ను కలిసిన సింగయ్య ఫ్యామిలీ
10 లక్షల ఆర్దిక సాయం
Scroll for the next article