News7th Nov 02:27 PMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 12వ ఎస్ఐపీబీ సమావేశం
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 12వ ఎస్ఐపీబీ సమావేశం జరుగుతోంది. సమావేశానికి మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, భరత్, నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్థన
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 12వ ఎస్ఐపీబీ సమావేశం జరుగుతోంది. సమావేశానికి మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, భరత్, నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్థన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సీఎస్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రం లో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలపనుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రారంభంకాని ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సీఎం సూచించారు.