Politics21st Aug 05:56 PMSunil Byrisetty1 min read
"సర్ "తో ఓటు హక్కుకు ముంచుకొస్తున్న ప్రమాదం
ఓటర్ల ప్రత్యేక సవరణతో ఓటు హక్కుకు ప్రమాదం ముందుకొస్తోందని, దీన్ని అడ్డుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. ఎసఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కార
ఓటర్ల ప్రత్యేక సవరణతో ఓటు హక్కుకు ప్రమాదం ముందుకొస్తోందని, దీన్ని అడ్డుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. ఎసఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన విజయవాడ బాలోత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు వక్తలను ఆహ్వానించారు. 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని అందరూ ఏక్రగీవంగా ఆమోదించడంతోపాటు మరికొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ప్రారంభిస్తూ వి.శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటరు కీలకమని, రాజకీయ పార్టీలు, ఓటర్లు లేకుండా ప్రజాస్వామ్యం ఉండదని అన్నారు. ఈ సమయంలో ఎసఐఆర్ పేరుతో ఓట్లను తొలగించేందుకు చేస్తున్న ప్రక్రియ అన్యాయమైందని తెలిపారు.