News13th Jul 12:48 PMSunil Byrisetty1 min read

బెజవాడలో సైరన్ల మోత

బెజవాడ నగరంలో రోడ్లపై సైరన్లు మోగించుకుంటూ రయ్ రయ్యిన కొన్ని వాహనాలు దూసుకుపోతుంటాయి. ఆ వాహనాలు ఏ వీవీఐపీలవో, మంత్రులవో అనుకుని ముందు వెళ్లే వాహన చోదకులు పక్కకు తప్పుకుంటారు. కానీ

బెజవాడలో సైరన్ల మోత
బెజవాడ నగరంలో రోడ్లపై సైరన్లు మోగించుకుంటూ రయ్ రయ్యిన కొన్ని వాహనాలు దూసుకుపోతుంటాయి. ఆ వాహనాలు ఏ వీవీఐపీలవో, మంత్రులవో అనుకుని ముందు వెళ్లే వాహన చోదకులు పక్కకు తప్పుకుంటారు. కానీ అనధికారికంగా సైరన్లు ఏర్పాటు చేసుకున్నవి కూడా ఉంటున్నాయి. ఎక్కడైనా సైరన్ మోగించుకుంటే వెళ్తున్న ఇలాంటి అనధికార వాహనాలను రవాణా శాఖ అధికారులు అపడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఆపకుండా మరింత వేగంగా దూసుకుపోతున్నారు. ఇలాంటివి గతంలో నామమాత్రంగా ఉండేవి. ఇప్పడవి లెక్కకు మిక్కిలిగా ఉంటున్నాయి. ఈ తరహా వాహనాలు రోజు రోజుకూ అధికమవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రత్యేక హోదా కలిగిన వారికి మాత్రమే సైరన్ ఉపయోగించే అవకాశం ఉంది. అందుకు విరుద్దంగా అక్రమంగా ప్రైవేట్ వాహనాలు సైరన్లను దుర్వినియోగం చేస్తున్నాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం అనధికారిక వాహనాల్లో సైరన్ ఉపయోగం నేరంగా పరిగణించబడుతుంది. కనుక సైరన్ల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Andhra Pradesh news
Vijayawada
Unauthorized Use of Sirens
vechiles
private vechiles
illegally misusing sirens
బెజవాడలో సైరన్ల మోత
Scroll for the next article