Entertainment28th Sep 05:17 PMSunil Byrisetty1 min read
సోషల్ మీడియా దెబ్బ.. అల్లు అబ్బా!
టాలీవుడ్ యువ కథానాయకుడు, అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. గణేష్ నవరాత్రుల సందర్భంగా తాను షేక్ పేటలో నివసించే కమ్యూనిటీకి దగ్గర్లో అర్గరాత్రి 2, 3 గంట
టాలీవుడ్ యువ కథానాయకుడు, అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. గణేష్ నవరాత్రుల సందర్భంగా తాను షేక్ పేటలో నివసించే కమ్యూనిటీకి దగ్గర్లో అర్గరాత్రి 2, 3 గంటల ప్రాంతంలో డీజే సౌండ్లతో హోరెత్తిస్తున్నారని, దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా ఫలితం లేకపోయిందని అన్నాడు. ఈ నెల 25 వరకు భరించక తప్పదని పోలీసులు చెప్పారని.. కానీ నిమజ్జనం అయ్యాక కూడా ఈ సౌండ్స్ అగట్లేదని.. దీని వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారని ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు.
దీనిపై అతడికి సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత తెచ్చిపెట్టింది. హిందూ పండగలపుడే ఈ సెలబ్రిటీలకు ఇలాంటి ఇబ్బందులు గుర్తుకు వస్తాయని.. హిందూ సంప్రదాయాలు, వేడుకలు అంటే అంత చిన్నచూపా అంటే అతడి మీద నెటిజన్లు విరుచుకు పడ్డారు. మసీదులు, చర్చిల నుంచి నుంచి వచ్చే సౌండ్స్ మీద కూడా రెస్పాండ్ అవుతారా అంటూ ప్రశ్నించారు. దీంతో బెంబేలెత్తిన శిరీష్ తాను పరమ ఆంజనేయ భక్తుడిని అని కొన్ని ఫోటోలను రుజువుగా చూపిస్తూ పోస్ట్ పెట్టాడు శిరీష్. తాను హిందూ మతాన్ని ఆచరిస్తానని.. ఆంజనేయస్వామి భక్తుడిని అని చెబుతూ.. అర్ధరాత్రి 2 గంటలకు భారీ సౌండుతో పాటలు ప్లే చెయ్యడం భక్తి కాదు అని పేర్కొన్నాడు.