Politics14th Oct 05:06 PMSunil Byrisetty1 min read

ఎంపీ మిథున్ రెడ్డికి షాక్.. సిట్ తనిఖీలు!

మద్యం కుంభకోణం కేసు ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ షాకిచ్చింది. ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతితో పాటు

ఎంపీ మిథున్ రెడ్డికి షాక్.. సిట్ తనిఖీలు!
మద్యం కుంభకోణం కేసు ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ షాకిచ్చింది. ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతితో పాటు హైదరాబాద్, బెంగళూరు నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయా నగరాల్లోని పీఎల్ఆర్ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో ఎక్కువ మొత్తం నగదు.. పీఎల్ఆర్ కంపెనీల ద్వారానే వైట్ చేశారన్న అనుమానాలు ఉన్నాయి. గతంలో ఐదు కోట్ల రూపాయలను ఇలా ఓ సూట్ కేసు కంపెనీ పేరుతో తమ కంపెనీలోకి మళ్లించుకున్న పీఎల్ఆర్ సంస్థ .. వివరాలు వెల్లడికావడంతోనే మిథున్ రెడ్డిని ఈ కేసులో చేర్చారు.
Andhra Pradesh
MP Mithun Reddy
Liquor Scam
SIT Raids
Tirupati News
Hyderabad
Bangalore
YSRCP
Corruption Case
వైఎస్సార్సీపీ
అవినీతి కేసు
పీఎల్ఆర్ కంపెనీ
Scroll for the next article