Politics25th Jul 09:38 AMSunil Byrisetty1 min read
మంత్రిపై దాడి కేసు సిఐడికి!
గత వైసిపి ప్రభుత్వంలో మంత్రి నిమ్మల రామానాయుడుపై జరిగిన దాడికి సంబందించిన కేసును సిఐడికి అప్పగించారు. అప్పట్లో దాడి ఘటన పై పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కేసు నమ
గత వైసిపి ప్రభుత్వంలో మంత్రి నిమ్మల రామానాయుడుపై జరిగిన దాడికి సంబందించిన కేసును సిఐడికి అప్పగించారు. అప్పట్లో దాడి ఘటన పై పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2022 లో చేసిన ఫిర్యాదును కేసుగా నమోదు చేశారు. నర్సాపురం డిఎస్పి విచారణ నేపధ్యంలో తాజాగా దీనిపై లోతుగా దర్యాప్తు జరిపేందుకు సిఐడికి బదలాయిస్తూ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ సిఐడి డిఎస్పీ మోహాన్ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేశారు.