Politics18th Aug 12:36 PMSunil Byrisetty1 min read
అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్లు వీరే
అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్లను నియమిస్తూ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు నిర్ణయం ప్రకటించారు. మొత్తం ఆరుగురు ప్యానల్ స్పీకర్లను నియమించారు. సభను సజావుగా నిర్వహించేందుకు ఆరుగురు సభ్
అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్లను నియమిస్తూ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు నిర్ణయం ప్రకటించారు. మొత్తం ఆరుగురు ప్యానల్ స్పీకర్లను నియమించారు. సభను సజావుగా నిర్వహించేందుకు ఆరుగురు సభ్యులతో ప్యానల్ స్పీకర్లను అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సమయంలో సభా వ్యవహారాలను నడిపించేందుకు ఈ ప్యానెల్ స్పీకర్లు బాధ్యతలు చెప్పడతారు.
ప్యానల్ స్పీకర్లుగా నియమితులైన ప్రజాప్రతినిధుల వివరాలు :
మండలి బుద్ధప్రసాద్ (జనసేన - అవనిగడ్డ)
కోళ్ల లలిత కుమారి (టీడీపీ - శృంగవరపుకోట)
జ్యోతుల నెహ్రూ (టీడీపీ - జగ్గంపేట)
పి. విష్ణుకుమార్ రాజు (బీజేపీ - విశాఖపట్నం నార్త్)
నంద్యాల వరదరాజులరెడ్డి (టీడీపీ -ప్రొద్దుటూరు)
దాసరి సుధ (వైసీపీ - బద్వేల్)