Spiritual24th Sep 03:46 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రి దసరా వేడుకలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించే కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఇం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించే కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా సత్యకుమార్ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను కలిశారు. దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఆయనను ఆహ్వానించారు. ఈ భేటీలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి సత్యకుమార్ యాదవ్ గౌహతిలో అసోం ఆరోగ్యశాఖ మంత్రి అశోక్ సింఘాల్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో భేటీ అయి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను దసరా మహోత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై పది రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి వేడుకల ప్రత్యేకతను అసోం సీఎంకు వివరించారు. 2025లో దసరా వేడుకలకు 15 లక్షలకు పైగా భక్తులు ఇంద్రకీలాద్రిని సందర్శించిన విషయాన్ని తెలిపారు.