News21st Aug 05:31 PMSunil Byrisetty1 min read
తండ్రిని బుక్ చేసిన బుడ్డోడు
నెల్లూరు జిల్లా ఆనంతసాగరం లో పోలీసుల తనిఖీల్లో భాగంగా కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చ్ లో భాగంగా ప్రతి ఇంటిని ఇంట్లోని వాహనాలను తనిఖీ చేసి పనిలో పడ్డారు. ఐతే పోలీసులు త
నెల్లూరు జిల్లా ఆనంతసాగరం లో పోలీసుల తనిఖీల్లో భాగంగా కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చ్ లో భాగంగా ప్రతి ఇంటిని ఇంట్లోని వాహనాలను తనిఖీ చేసి పనిలో పడ్డారు. ఐతే పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో సురేష్ అనే వ్యక్తి బైక్ కి సరైన పత్రాలు లేకపోవడమో లేదా మరేదైనా కారణమో తెలియదు కానీ బైక్ ను ఇంటికి దూరంగా మరో వీధిలోకి తీసుకువెళ్లి పెట్టాడు. సురేష్ కొడుకు ఆరేళ్ళ వయసున్న మహేంద్ర తన తండ్రి పోలీసులను చూసి బైక్ దాచిపెట్టడ్డాన్ని గుర్తించాడు దీంతో కార్డెన్ సర్చ్ చేస్తున్న పోలీసుల వద్దకి వెళ్లి తన తండ్రి పోలీసులను చూసి బైక్ దాచిపెట్టడని చెప్పడంతో పాటు వారిని వెంటబెట్టుకుని మరి తన తండ్రి దాచిన బైక్ ను పోలీసులకు చూపించాడు.. అయితే చిన్నారి పోలీసుల వద్దకు వెళ్లి మీరు వస్తున్నారని మా నాన్న బైక్ వేరే దగ్గరదాచి పెట్టాడని అక్కడికి రావాలని చెప్పడం అక్కడ వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే కుటుంబ సభ్యులు చేస్తున్న చిన్న చిన్న పొరపాటు లకే అబద్దాలు చెప్పి వారిని కాపాడుకుంటున్న ఈ రోజుల్లో తన తండ్రి చేసిన తప్పునుధైర్యగా పోలీసుల వద్దకు వెళ్లి చెప్పిన మహీంద్రా ని శభాష్ అనాల్సిందే మరి.