Politics30th Jul 05:22 PMSunil Byrisetty1 min read
కాక్రోచ్ పై బీజేపీ బెదిరింపులు
సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే కొత్త పాట అందుకున్నారు కాషాయ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీలోకి రావాలని తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆయన చేసిన కామెంట్స్ రాజ
సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే కొత్త పాట అందుకున్నారు కాషాయ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీలోకి రావాలని తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మోదీ సర్కార్ మెడలు వంచిన యువ నాయకుడిగా అభిజిత్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. నీట్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సీజేపీ నేతృత్వంలో మొదట ఢిల్లీలో ఉద్యమం ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా అంటుకుంది. దీంతో అనివార్య పరిస్థితిలో ధర్మేంద్ర ప్రధాన్‌తో ప్రధాని మోదీ రాజీనామా చేయించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు. తనను పార్టీలో చేరాలని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.