Politics1st Aug 10:29 AMSunil Byrisetty1 min read

దూషించినంత మాత్రాన కేసులా?: సీజేపీ చీఫ్

ఒకరిని దూషిస్తే కేసులు పెట్టేస్తారా అంటూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. సీజేపీ నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై రుచికా స

దూషించినంత మాత్రాన కేసులా?: సీజేపీ చీఫ్
ఒకరిని దూషిస్తే కేసులు పెట్టేస్తారా అంటూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. సీజేపీ నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై రుచికా సింగ్ పై కేసు నమోదైంది. తాజాగా రుచికా సింగ్‌కు అభిజీత్ దీప్కే బహిరంగంగా మద్దతు తెలిపారు. ఒకరిని దూషించినంత మాత్రాన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే చట్టం లేదని అన్నారు. అదే అలా అయితే బీజేపీ ఐటీ సెల్ సభ్యులపైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలి కదా అని ప్రశ్నించారు. అనుచితంగా మాట్లాడితే కేసులు పెట్టడం కంటే నచ్చజెప్పడం మంచిదని అభిప్రాయపడ్డారు. అయితే అభిజిత్ కుటుంబ సభ్యులను కూడా దూషిస్తే ఇలాగే మాట్లాడతారా, ప్రధానిని దూషించడం అంటే మనం ఎన్నుకున్న అధినేతను విమర్శించడమే అవుతుందని నెటిజన్లు స్పందిస్తున్నారు.
India news
Abhijit Deepke
SJP
Cockroach Janata Party
Ruchika Singh
Narendra Modi
FIR
రాజకీయ వివాదం
బీజేపీ
భారత రాజకీయాలు
జాతీయ వార్తలు
Scroll for the next article