Education28th Dec 03:25 PMSunil Byrisetty1 min read

మూడు నెల‌ల్లో కె.బి.ఎన్. కాలేజీలో స్కిల్ సెంట‌ర్

దేశ విదేశాల్లో వేలాదిగా స్థిర‌ప‌డిన కెబిఎన్ కాలేజీ పూర్వవిద్యార్థులందరూ కాలేజీ అభివృద్ధితో పాటు న‌గ‌ర అభివృద్దికి సహకరించాల‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ పిలుపునిచ్చారు. కెబి

మూడు నెల‌ల్లో కె.బి.ఎన్. కాలేజీలో స్కిల్ సెంట‌ర్
దేశ విదేశాల్లో వేలాదిగా స్థిర‌ప‌డిన కెబిఎన్ కాలేజీ పూర్వవిద్యార్థులందరూ కాలేజీ అభివృద్ధితో పాటు న‌గ‌ర అభివృద్దికి సహకరించాల‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ పిలుపునిచ్చారు. కెబిఎన్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం (కోసా) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన‌ ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి కె.బి.ఎన్ .కాలేజీ క‌మిటీ స‌భ్యుల‌తో పాటు కెబిఎన్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం (కోసా) స‌భ్యులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ప‌లు రంగాల్లో స్థిర‌ప‌డిన కెబిఎన్ పూర్వ విద్యార్ధులైన మాజీ డి ఎస్ పి అశోక్ కుమార్ గౌడ్, సి ఛానెల్ సి ఈ ఓ ర‌మేష్ బాబు, న‌టులు సుహాస్, సైకాల‌జిస్ట్ డాక్టర్ ఆర్.కె. అయోధ్య, ఐ ఎఫ్ ఎస్ అధికారి ( ఛత్తీస్ ఘడ్) జె.ఎ.సి.ఎస్.రావు, ప్ర‌ముఖ న్యాయవాది నందిపాటి శ్రీనివాస‌రావుల‌తో పాటు విశ్రాంత అధ్యాపకులను ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఘనంగా స‌త్క‌రించారు.
Education Infrastructure
KBN College
Skill Development Centre
Kesineni Sivanath
Vijayawada MP
KBN Alumni Association KOSA
Higher Education
Alumni Meet
College Development
City Development
Youth Skills
Scroll for the next article