Education16th Jul 12:50 PMSunil Byrisetty1 min read

సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ప్రారంభం

యువత, పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నైపుణ్యం పోర్టల్‌ను ఆగష్టు నాటికి పూర్తిచేసి సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మం

సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ప్రారంభం
యువత, పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నైపుణ్యం పోర్టల్‌ను ఆగష్టు నాటికి పూర్తిచేసి సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయింట్ ఆఫీసర్ ను డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్‌గా మార్చి.. వారి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను ఓంక్యాప్ ద్వారా కల్పించాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి తగిన సహాయక మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నెంబర్ 0863-2340678, లేదా వాట్సాప్ నెంబర్ 8500027678 ను సంప్రదించాలని సూచించారు.
Andhra Pradesh
Education
Skill development
Nara lokesh
Trainning
skill training programs
employment opportunities
job fairs
నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు
విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు
Scroll for the next article