News19th Aug 01:33 PMSunil Byrisetty1 min read

మోదీ, చంద్రబాబు బాటలో స్కిల్స్

ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించాలని, ఒకేషనల్ విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. మార్కెట్ కు కావాల్సి

మోదీ, చంద్రబాబు బాటలో స్కిల్స్
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించాలని, ఒకేషనల్ విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. మార్కెట్ కు కావాల్సిన స్కిల్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తయారీ, ఎనర్జీ, హెల్త్, ఐటీ, అనుబంధ రంగాలు వృద్ధి చెందుతున్నాయని, వాటికి కావాల్సిన స్కిల్డ్, జాబ్ రెడీ వర్క్ ఫోర్స్ అవసరమని వివరించారు. ఇండస్ట్రీ అలైన్డ్ స్కిల్లింగ్ అనేది కీలకమన్నారు. ఇండస్ట్రీల్లో నైపుణ్యాలున్న సిబ్బంది కొరత, యువతేమో ఉద్యోగాల కొరత ఉన్నాయని చెబుతున్నారని, ఇందుకు కారణం స్కిల్ గ్యాప్ అని పేర్కొన్నారు. దీన్ని భర్తీ చేసి, నెక్ట్స్ లెవల్ జాబ్స్ కల్పించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎన్ఎస్ క్యూఆర్ఎఫ్, ఎన్సీఆర్ఎఫ్ కింద ప్రత్యేకంగా ఉన్నత విద్యలో స్కిల్ ఎడ్యుకేషన్ తీసుకువచ్చామని తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ కి, స్కిల్ ఎడ్యుకేషన్ కాంప్లిమెంటరీగా ఉంటాయన్నారు.
Andhra Pradesh
Nara Lokesh
Narendra Modi
Chandrababu Naidu
Skill Development
Vocational Education
Skill Education
Industry-Aligned Skills
జాతీయ విద్యా విధానం
ఎన్‌ఎస్‌క్యూఎఫ్
ఎన్‌సీఆర్‌ఎఫ్
ఉన్నత విద్య
సాంకేతిక విద్య
స్కిల్ యూనివర్సిటీలు
Scroll for the next article