Jobs22nd Aug 12:59 PMSunil Byrisetty1 min read
బ్లూ బూమ్.. వైట్ కాలర్ కన్నా స్కిల్డ్ బెటర్!
ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా సెంటర్లు, ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే విద్యుత్ వ్యవస్థలు, ఏసీ టెక్నాలజీ, రోబోటిక్స్, నిర్వహణ సిబ్బంది అవ
ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా సెంటర్లు, ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే విద్యుత్ వ్యవస్థలు, ఏసీ టెక్నాలజీ, రోబోటిక్స్, నిర్వహణ సిబ్బంది అవసరం. అందుకే ఎలక్ట్రీషియన్లు, మెకానిక్‌లు, వెల్డర్లు, ప్లంబర్లు, రోబోటిక్స్ నిపుణుల అవసరం పెరుగుతోంది. టాలెంట్ సంస్థ రాండ్‌స్టాడ్ విశ్లేషణ ప్రకారం 5 కోట్లకు పైగా ఉద్యోగ ప్రకటనలను పరిశీలించి విశ్లేషించగా గత నాలుగేళ్లలో ఎలక్ట్రిషియన్ల డిమాండ్ 242%, హెచ్‌వీఏసీ టెక్నీషియన్ల డిమాండ్ 200%, రోబోటిక్స్ టెక్నీషియన్ల అవసరం గణనీయంగా పెరిగినట్లు తేలింది. 2022 నుంచి 2026 మధ్య కాలంలో భారత దేశంలో బ్లూకాలర్ ఉద్యోగాల సంఖ్య 93% పెరిగింది. అదే సమయంలో వైట్ కాలర్ ఉద్యోగాల వృద్ధి 40% వద్దే నిలిచింది. బ్లూకాలర్ ఉద్యోగుల జీతాలు ఏటా సగటున 5.7 శాతం పెరుగుతున్నాయి. ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో పెరుగుదల 4 శాతం మాత్రమే నమోదైంది. రోబోటిక్స్ నిర్వహణ, ప్రత్యేక యంత్రాల మెయింటినెన్స్ మెకానిక్‌ల వార్షిక వేతనం సగటున రూ. 8లక్షలకు పైగా ఉండగా ప్లాంట్ ఆపరేటర్లు రూ.7 లక్షలు, నిర్మాణ రంగ సిబ్బంది రూ.5 లక్షలు, ఎల్రక్టీషియన్లు సుమారు రూ.3 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. దీనికి విరుద్ధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అకౌంటింగ్ వంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో వేతనాలు తక్కువగా ఉండడమే కాకుండా వారిపై ఆటోమేషన్ ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది.