Telangana28th May 12:37 PMSunil Byrisetty1 min read

బ్లాస్టింగ్ తప్పదు.. ఎస్ఎల్బీసీపై నిర్ణయం!

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో ప్రభుత్వానికి సాంకేతిక కమిటీ కీలక సూచనలు చేసింది. ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో టీబీఎంతో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలోనే తవ్వగలరని ప

బ్లాస్టింగ్ తప్పదు.. ఎస్ఎల్బీసీపై నిర్ణయం!
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో ప్రభుత్వానికి సాంకేతిక కమిటీ కీలక సూచనలు చేసింది. ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో టీబీఎంతో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలోనే తవ్వగలరని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్‌బీసీ) ఇన్లెట్ వైపు సొరంగం తవ్వకానికి సంబంధించి ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. సొరంగంలో చిక్కుకున్న వారి కోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఇన్ఐఆర్ఎం) సహాయం తీసుకోవాలని, ప్రమాద జోన్లో ఉన్న 50 మీటర్లపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) ద్వారా సమగ్ర సర్వే చేయించాలని సూచించింది. ఈ నెల 30వ తేదీలోగా టన్నెల్లో భూసాంకేతిక (జియో టెక్నికల్) పరీక్షలు, జూన్ 30వ తేదీలోగా సమగ్ర సర్వే, ఆగస్టు నెల కల్లా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సాంకేతిక కమిటీ సిఫార్సు చేసింది
Telangana
Technical Committee
SLBC Tunnel Excavation
Drilling and Blasting Method
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్
ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో టీబీఎంతో తవ్వకాలు
Scroll for the next article