Farmers6th Jan 03:30 PMSunil Byrisetty1 min read
స్మార్ట్ వ్యవసాయంతో రైతు ఆదాయం పెంపు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం విజయవాడలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం విజయవాడలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సూక్ష్మ సాగునీటిలో ఆటోమేషన్ ను మంత్రి ప్రారంభించారు. నీటి వనరుల తగ్గుదల, వాతావరణ మార్పులు, సాగు వ్యయాల పెరుగుదల వంటి సవాళ్ల మధ్య రైతును కాపాడాలంటే వ్యవసాయాన్ని స్మార్ట్ వ్యవసాయంగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశానికి మార్గదర్శకమైన మైక్రో ఇరిగేషన్‌ను మరింత బలోపేతం చేస్తూ, “పర్ డ్రాప్ మోర్ క్రాప్” నుంచి “పర్ డ్రాప్ మోర్ రిటర్న్స్” దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇకపై నీరు, ఎరువుల వినియోగం ఊహలపై కాకుండా సెన్సర్లు, డేటా, ఆటోమేషన్ ఆధారంగా జరగడంతో 20–30 శాతం నీటి ఆదా, కార్మిక వ్యయాల తగ్గింపు, దిగుబడి,నాణ్యత పెరుగుదల సాధ్యమవుతాయని చెప్పారు. ఉద్యాన, తోట, షేడ్ నెట్, గ్రీన్ హౌస్ మరియు అధిక విలువైన పంటలకు ఈ పథకం అత్యంత ఉపయోగకరమని వివరించారు. PMKSY కింద హెక్టారుకు ₹40,000 వరకు మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతోందని తెలిపారు.