News8th Oct 03:10 PMSunil Byrisetty1 min read
ఏపీలో ఎక్కడా లేని స్మార్ట్ ఫీచర్ పార్క్
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా స్థానిక ఎస్ బి ఐ కాలనీలో స్మార్ట్ ఫీచర్ పార్క్ ఏర్పాటుచేశామని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. క్రికెట్ బాక్స్ తో కూడిన ఈ ప
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా స్థానిక ఎస్ బి ఐ కాలనీలో స్మార్ట్ ఫీచర్ పార్క్ ఏర్పాటుచేశామని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. క్రికెట్ బాక్స్ తో కూడిన ఈ పార్క్ లో వెలుగులు యాప్ ఆధారితంగా ఏర్పాటుచేశామని తెలిపారు. బుధవారం ఉదయం ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి స్మార్ట్ ఫీచర్ పార్క్ ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ, స్థానికులు దీని నిర్వహణ చూసుకోడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఎక్కడో ఒక పార్క్ అభివృద్ధి చేసి, దాన్ని చూడ్డానికి అక్కడకు రండి అని జనాలకు చెప్పేవారని, కూటమి అధికారంలోకి వచ్చాక జనం ఉన్నచోటకే అభివృద్ధి తీసుకెళ్తున్నామని చాల గర్వంగా చెబుతున్నామని అన్నారు. అలాగే షటిల్ కోర్టు, చిల్డ్రన్స్ ప్లే , అవుట్ డోర్ జిమ్ , చుట్టూ లైటింగ్, వాకింగ్ ట్రాక్ అండ్ గ్రీనరీ, ఆటోమేటిక్ యాప్ కంట్రోల్ లైటింగ్ వంటివన్నీ ఈ పార్కులో ఉన్నాయని వివరించారు.