Telangana5th Jul 01:39 PMSunil Byrisetty1 min read

యువకుడి ప్యాంటు జేబులో పేలిన ఫోన్

వివో స్మార్ట్ ఫోన్ పేలడంతో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో శ్రీనివాస్ అనే యువకుడు వివో ఫోన్ వాడి జేబులో పెట్టుకు

యువకుడి ప్యాంటు జేబులో పేలిన ఫోన్
వివో స్మార్ట్ ఫోన్ పేలడంతో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో శ్రీనివాస్ అనే యువకుడు వివో ఫోన్ వాడి జేబులో పెట్టుకున్నాడు. అప్పటికే హీటెక్కిన ఫోన్.. జేబులోనే ఒక్కసారిగా పేలిపోయింది. వెంటనే అప్రమత్తమై.. జేబులో నుంచి ఫోన్ తీసిన శ్రీనివాస్ దూరంగా పారేశాడు. అయితే.. అప్పటికే ఫోన్ హీట్ అవ్వడంతో శ్రీనివాస్ కాలుకి తీవ్ర గాయమైంది. పైనున్న చర్మం కాలి.. మరో లేయర్ వరకు గాయం చేరిందని డాక్టర్ తెలిపారు. వెంటనే అప్రమత్తం అవ్వకపోయి ఉంటే.. తీవ్రంగా గాయాలై ఉండేవని అన్నారు. ఇంటర్ నెట్ డాటా ఆన్‌లో ఉంచితే ఫోన్ వేడెక్కి ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Telangana News
Srinivas
vivo Smartphone blast
Phone explosion
Attapur
Rajendranagar
Mobile phone safety
Phone battery
Rangareddy district
యువకుడి ప్యాంటు జేబులో పేలిన ఫోన్
Scroll for the next article