News5th Jul 04:50 PMSunil Byrisetty1 min read
ఆగస్టులో కొత్త రేషన్ కార్డులు!
రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల జారీపై కసరత్తు కొనసాగుతోంది. స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. QR కోడ్‌తో వివరాలు ప్రత
రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల జారీపై కసరత్తు కొనసాగుతోంది. స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర కార్డులు పంపిణీ చేయనుంది. రాజకీయ నేతల ఫోటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్దిదారు ఫోటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డు దారులకు ఆగస్టు నెలలో వీటిని జారీ చేయనుంది.