News14th Sep 03:32 PMSunil Byrisetty1 min read
స్మార్ట్ రైస్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం
రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకువచ్చిందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాస
రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకువచ్చిందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. రామచంద్రపురం మండలం, ద్రాక్షారామ గ్రామపంచాయతీ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు బియ్యం, నిత్యవసర సరుకులను సక్రమంగా పంపిణి చేస్తూ కూటమి ప్రభుత్వం వ్యవస్థను మరింత బలోపేతం చేసిందన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో పేద ప్రజలకు చెందాల్సిన సరుకులు ప్రక్కదారి పట్టి విదేశాలకు ఎగుమతి అయ్యాయని అన్నారు. గత ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా పేదల బియ్యం వారికే దక్కేలా స్మార్ట్ కార్డు అనే ఆధునిక విధానం క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వం రైస్ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టిందన్నారు.
ద్రాక్షారామ గ్రామంలో ఉన్న 2255 రైస్ కార్డులు, 5 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఉచితంగా రేషన్ పొందే అవకాశం ప్రభుత్వ కల్పించిందన్నారు.