Mobiles30th Nov 12:19 PMSunil Byrisetty1 min read
డిసెంబర్‌లో రిలీజయ్యే స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. ఫీచర్లు చూస్తే ఫిదా
డిసెంబర్ వచ్చేస్తోంది. డిసెంబర్లో అనేక బ్రాండ్ల కొత్త ఫోన్లు విడుదలకు రెడీ అయ్యాయి. వీటిలో అత్యాధునిక ఏఐ ఫీచర్లు కూడా వీటిల్లో ఉన్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలైన వన్‌ప్
డిసెంబర్ వచ్చేస్తోంది. డిసెంబర్లో అనేక బ్రాండ్ల కొత్త ఫోన్లు విడుదలకు రెడీ అయ్యాయి. వీటిలో అత్యాధునిక ఏఐ ఫీచర్లు కూడా వీటిల్లో ఉన్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలైన వన్‌ప్లస్, రెడ్ మీ, వివో, రియల్ మీ వంటి పెద్ద బ్రాండ్‌ల నుండి కొత్త ఫోన్‌లు లాంచ్ కానున్నాయి.
వివో ఎక్స్ 300
డిసెంబర్ 2న లాంచ్ అయ్యే ఈ ఫోన్ X300 200-మెగాపిక్సెల్ టెలిఫోటో, 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో వస్తుంది.
రెడ్ మీ 15C 5G
డిసెంబర్ 3న అమెజాన్ లో రాబోతున్నఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 15లో హైపర్‌ఓఎస్ వస్తోంది. 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 50MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 4GB ర్యామ్+ 128GB వేరియంట్ ధర రూ.12,499, 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.13,999, 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.14,999గా ఉండనుంది.
రియల్‌మీ P4ఎక్స్ 5G
డిసెంబర్ 4న ఈ ఫోన్ లాంచ్ కానుంది. 7000mAh బ్యాటరీతో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్, 45W ఫాస్ట్ ఛార్జ్, 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 10GB వర్చువల్ RAMతో 8GB RAM, కూలింగ్ సిస్టమ్, 50-మెగాపిక్సెల్ AI కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.