News29th Mar 11:40 AMSunil Byrisetty1 min read
పరీక్షా కేంద్రంలో పాము.. అధికారిని కాటు
చిలకలూరిపేటలోని పదో తరగతి పరీక్షా కేంద్రంలో పాము కాటేసిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. హఠాత్తుగా పరీక్షా కేంద్రంలోకి పాము రావడంతో అందర
చిలకలూరిపేటలోని పదో తరగతి పరీక్షా కేంద్రంలో పాము కాటేసిన ఘటన చోటు చేసుకుంది.
దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. హఠాత్తుగా పరీక్షా కేంద్రంలోకి పాము రావడంతో అందరూ కంగారు పడ్డారు.
పట్టణంలోని వేద స్కూల్లో 10th పరీక్షలకు చీఫ్ సూపరింటిండెంట్‌గా విజిట్‌కు వెళ్లిన కరీముల్లాను పాము కాటు వేసింది.
వెంటనే ఉపాధ్యా యులు, స్థానికులు కరీముల్లాను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి ప్రాథమిక చికిత్స అందించారు.
ప్రస్తుతం కరిముల్లా ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.