National26th Jan 11:42 AMSunil Byrisetty1 min read

ఆఫ్ఘనిస్థాన్లో మంచు తుపాను

ఆఫ్ఘనిస్థాన్ అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలు, మంచు కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో మంచు తుపాను, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి

ఆఫ్ఘనిస్థాన్లో మంచు తుపాను
ఆఫ్ఘనిస్థాన్ అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలు, మంచు కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో మంచు తుపాను, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మంచు కురుస్తుండటంతో ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 61 మంది మృతి చెందగా, 110 మందికి పైగా గాయపడినట్లు అక్కడి విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. మధ్య, తూర్పు ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో తుపాను తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Afghanistan
Snowstorm
Heavy Rainfall
Extreme Weather
Natural Disaster
Sub-Zero Temperatures
Weather Alert
Disaster Management
Floods
Climate Impact
Scroll for the next article