Business Type22nd Dec 02:46 PMSunil Byrisetty1 min read

చుక్కలనంటిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలకు అడ్డూ అదుపు ఉండటం లేదు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,100 పెరిగి రూ.1,35,280కు చేరింది

చుక్కలనంటిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలకు అడ్డూ అదుపు ఉండటం లేదు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,100 పెరిగి రూ.1,35,280కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,000 ఎగబాకి రూ.1,24,000 పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,31,000కు చేరింది. వెండి ధర 3 రోజుల్లోనే రూ.10వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. దీంతో కొనుగోలుదారులు వేచి చూస్తున్నారు.
Andhra Pradesh
Telangana
market update
gold price
silver price
Hyderabad bullion market
24K gold
22K gold
precious metals
silver rate
India
jewelry rates
investment
price surge
Scroll for the next article