International9th Sep 08:47 AMSunil Byrisetty1 min read

నిరసనలతో అట్టుడుకుతున్న నేపాల్!

నేపాల్ దేశంలో నిరసనలు హీటెక్కుతున్నాయి. సోషల్‌ మీడియాను బ్యాన్‌ చేస్తూ నేపాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌

నిరసనలతో అట్టుడుకుతున్న నేపాల్!
నేపాల్ దేశంలో నిరసనలు హీటెక్కుతున్నాయి. సోషల్‌ మీడియాను బ్యాన్‌ చేస్తూ నేపాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌, యూట్యాబ్‌ సహా 26 సామాజిక మాధ్యమాలపై నిషేధం విధింపుతో ఆగ్రహించిన పౌరులు పార్లమెంట్‌ ఆవరణలోకి చేరుకొని దాడులకు తెగబడ్డారు. అక్కడి భద్రతా సిబ్బందే.. తమను తాము కాపాడుకునేందుకు పారిపోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా చెలరేగిన నిరసనల్లో అనేక మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. మరెందరో గాయాల పాలయ్యారు. సోషల్‌ మీడియా బ్యాన్‌.. అంతటి నిరసనలు ఎలా కారణమైందని ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. దీని వెనక ఇంకా ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా.? నిరసనలపై పౌరుల, ప్రభుత్వ వైఖరేంటనేది ఆరా తీస్తోంది.
Nepal Protests
Social Media Ban
Nepal Government
Facebook Ban
Instagram Ban
WhatsApp Ban
YouTube Ban
Nepal Parliament
Public Outrage
Internet Freedom
Civil Unrest
Human Rights
Scroll for the next article