Politics26th Aug 09:57 AMSunil Byrisetty1 min read
కొత్త రాజకీయ మైదానంగా సోషల్ మీడియా
దేశ రాజకీయాల్లో కొత్త తరం ప్రభావం పెరుగుతోంది. రాజకీయ పార్టీల భాష, ప్రచార విధానం, నిరసనల రూపం, సోషల్ మీడియా వ్యూహాలు, యువతను ఆకర్షించే కార్యక్రమాలు క్రమంగా మారుతున్నాయి. ఈ మార్పు మ
దేశ రాజకీయాల్లో కొత్త తరం ప్రభావం పెరుగుతోంది. రాజకీయ పార్టీల భాష, ప్రచార విధానం, నిరసనల రూపం, సోషల్ మీడియా వ్యూహాలు, యువతను ఆకర్షించే కార్యక్రమాలు క్రమంగా మారుతున్నాయి. ఈ మార్పు మధ్యలో నిలుస్తున్న వర్గమే జెన్-జీ. సాధారణంగా 1990ల చివరి నుంచి 2010ల ప్రారంభం మధ్య జన్మించిన తరాన్ని జెన్-జీగా పరిగణిస్తారు. స్మార్ట్‌ఫోన్‌తో పెరిగిన ఈ తరం రాజకీయ సమాచారాన్ని ప్రధానంగా సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, మీమ్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్, వాట్సాప్, ఎక్స్ వంటి డిజిటల్ వేదికల ద్వారా స్వీకరిస్తోంది. ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అన్న నిర్ణయం కేవలం పార్టీ చరిత్ర, సిద్ధాంతం లేదా కుటుంబ రాజకీయ అనుబంధాల ఆధారంగా కాకుండా.. ఒక సమస్యపై పార్టీ ఎలా స్పందించింది? ఎవరు ముందుగా మాట్లాడారు? ఎవరు ఉద్యమించారు? ఎవరు తమ సమస్యను వైరల్ చేశారు? అనే అంశాలపైనా ఆధారపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇదే కారణంగా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు జెన్-జీని తమవైపు తిప్పుకునేందుకు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నాయి.