News19th Oct 02:32 PMSunil Byrisetty1 min read

స్థానిక ఎన్నికలలో 'సోషల్ రీ-ఇంజనీరింగ్'

స్థానిక సంస్థల ఎన్నికలలో 'సోషల్ రీ-ఇంజనీరింగ్'కు పెద్ద పీట వేసామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించామని, యువతను ప్రోత్సహించామని తెలిపా

స్థానిక ఎన్నికలలో 'సోషల్ రీ-ఇంజనీరింగ్'
స్థానిక సంస్థల ఎన్నికలలో 'సోషల్ రీ-ఇంజనీరింగ్'కు పెద్ద పీట వేసామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించామని, యువతను ప్రోత్సహించామని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన అందరి రిపోర్ట్ లు తెప్పించుకున్నానని చెప్పారు. పార్టీకి ఎంత లాయల్ గా ఉన్నారు, ఎంత కష్టపడ్డారు.. అన్నీ పరిశీలించి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి సీట్లు కేటాయించామని వివరించారు. ప్రజలు మెచ్చిన వాళ్లనే అభ్యర్థుల ఎంపిక చేసేలా కసరత్తు చేశామన్నారు. ఒక్కో మేయర్ స్థానాన్ని ఒక్కో సామాజిక వర్గానికి ఇచ్చామని తెలిపారు. 'గంజాయి బ్యాచ్' వర్సెస్ 'విద్యావంతులు' అన్నట్టుగా స్థానిక ఎన్నికల్లో పోటీ నెలకొందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Scroll for the next article