News30th Oct 12:25 PMSunil Byrisetty1 min read
లబ్ధిదారుల ఇంటి ముంగిటకే పింఛన్ అందజేత
రాజమహేంద్రవరం నగరంలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం నుంచే నిర్దిష్టంగా ప్రారంభమైందని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఇన్నీస్ పేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్
రాజమహేంద్రవరం నగరంలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం నుంచే నిర్దిష్టంగా ప్రారంభమైందని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఇన్నీస్ పేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా ఆయన పర్యవేక్షించారు. లబ్ధిదారుల ఆధార్ కార్డులను పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. అలాగే కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పింఛనుదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పింఛన్ పంపిణీ చేస్తున్నదీ లేనిదీ ఆరా తీశారు. నగరంలో మొత్తం 27,036 మంది లబ్ధిదారులకు 11 కోట్ల 96 లక్షల 83 వేల 500 రూపాయలు పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మిగిలిపోయిన వారికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి దృష్ట్యా నవంబర్ 4, 5 తేదీలలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే సాయంత్రంలోపు 100 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు.