Politics25th Apr 05:55 PMSunil Byrisetty1 min read
బెజవాడలో అన్నాదమ్ముల సవాల్!
విజయవాడలో అన్నాదమ్ముల సవాల్ రచ్చకెక్కుతోంది. ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఆయన సోదరుడు కేశినేని శ్రీనివాస్(నాని) మధ్య సోషల్ మీడియా వార్ ముదిరింది. విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచ
విజయవాడలో అన్నాదమ్ముల సవాల్ రచ్చకెక్కుతోంది.
ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఆయన సోదరుడు కేశినేని శ్రీనివాస్(నాని) మధ్య సోషల్ మీడియా వార్ ముదిరింది.
విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచిన నాని గత ఎన్నికల్లో చిన్ని చేతిలో ఓడిపోయారు.
ఓటమితో రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన నాని.. తాజాగా సోషల్ మీడియా
వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల విశాఖలో భూములు కేటాయించిన ఉర్సా సంస్థ చిన్ని బినామీ అంటూ నాని ఆరోపణలు చేశారు.
నాని ట్వీట్‌కు చిన్ని కౌంటర్ ట్వీట్లతో ఇరువురి మధ్య సోషల్ మీడియా వార్‌కు తెరలేచింది.
సోషల్ మీడియా రోడ్లపై సైకో తిరుగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కేశినేని చిన్ని కౌంటర్ ఎటాక్ చేశారు.
నాని వ్యాఖ్యలపై చిన్ని రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు.
దీనిపై కేశినేని నాని స్పందిస్తూ.. దేనికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.
రూ.100 కోట్లకు కాదు, రూ. లక్ష కోట్లకు పరువు నష్టం వేసినా భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.