Politics10th Nov 04:52 PMSunil Byrisetty1 min read
పంచాయతీ ఎన్నికల తరువాత సొసైటీ ఎన్నికలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయాన్ని చూసుకొని గర్వంతో విర్రవీగొద్దని మంత్రులకు సీఎం స్పష్టం చేశారు. ఒద్దికగా ఉండండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయాన్ని చూసుకొని గర్వంతో విర్రవీగొద్దని మంత్రులకు సీఎం స్పష్టం చేశారు. ఒద్దికగా ఉండండి.. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. 2029 ఎన్నికలపై దృష్టి పెట్టాలని.. ఆ దిశగా అందరం పని చేయాలని అన్నారు. కూరగాయల ధరలు తగ్గాయని.. బియ్యం ధరలు కూడా తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రజలపై ధరల భారం ఉండకూడదని అన్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తరువాత సొసైటీ ఎన్నికలు ఉంటాయని తెలిపారు. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత మనమంతా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో రైతు బజార్లలో ధర తగ్గించి బియ్యం విక్రయిస్తున్నామని ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.