News6th Aug 02:26 PMSunil Byrisetty1 min read

రాజధానిలో అక్రమ మట్టి తవ్వకాలు

రాజధాని అమరావతిలో మట్టి మాఫియా బరితెగిస్తోంది. చీకటి పడగానే మూడు ప్రొక్లెయిన్లు.. ఆరు లారీలు..అన్నట్లు మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో

రాజధానిలో అక్రమ మట్టి తవ్వకాలు
రాజధాని అమరావతిలో మట్టి మాఫియా బరితెగిస్తోంది. చీకటి పడగానే మూడు ప్రొక్లెయిన్లు.. ఆరు లారీలు..అన్నట్లు మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధంగానే కూటమి ప్రభుత్వంలోనూ మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మట్టి మాఫియా నుంచి లక్షల్లో మామూళ్లు అందుకుంటున్నందునే అక్రమ తవ్వకాలు, రవాణా విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రాత్రివేళ జాతీయ రహదారి విస్తరణ పనులు మట్టి మాఫియా కు ఒక వరంగా మారాయి. రాత్రివేళ ఎవరైనా మట్టి మాఫియాను ప్రశ్నిస్తే... రహదారి విస్తరణ పనుల కోసం అని నమ్మపలుకుతూ మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత ఆరేళ్లుగా ఇప్పటివరకు వందల కోట్ల విలువైన మట్టిని మాఫియా తరలించి సొమ్ము చేసుకుందంటే ఎంత భారీగా దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
Andhra Pradesh news
Amaravati
Soil Mafia
Illegal Excavation
Corruption
Highway Expansion Scam
Night time Operations
YSRCP
TDP Alliance
Sand and Soil Mining
రాజధానిలో అక్రమ మట్టి తవ్వకాలు
Scroll for the next article