News26th Apr 12:29 PMSunil Byrisetty1 min read
కశ్మీర్ ఉగ్రదాడి హేయమైన చర్య
కశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్యగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అభివర్ణ
కశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్యగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అభివర్ణించారు.
ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి ధర్నా చౌక్ వరకు శాంతి, సంఘీభావ ర్యాలీ జరిగింది.
ర్యాలీని ఉద్దేశించి ఐవీ సుబ్బారావు ప్రసంగిస్తూ శాంతియుత పర్యాటక ప్రాంతమైన పెహల్గాంలో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకులను కాల్చి చంపడం దురదృష్టకరమన్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు.
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచల జయరాజ్, విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వర రావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, జీ.రామారావు, శివరామ కృష్ణ, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.