News28th Apr 03:17 PMSunil Byrisetty1 min read

ఒంటరి ప్రయాణమా? ఈ జాగ్రత్తలతో మహిళలు సేఫ్!

ఒంటరి ప్రయాణాలు గొప్ప అనుభూతులనిస్తాయి. ప్రపంచం ఓ కుగ్రామంగా మారాక మహిళలు, యువతులు కూడా ఒంటరి ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే మహిళలు కూడా సోల

ఒంటరి ప్రయాణమా? ఈ జాగ్రత్తలతో మహిళలు సేఫ్!
ఒంటరి ప్రయాణాలు గొప్ప అనుభూతులనిస్తాయి. ప్రపంచం ఓ కుగ్రామంగా మారాక మహిళలు, యువతులు కూడా ఒంటరి ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే మహిళలు కూడా సోలో ట్రావెలింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఒక ప్రాంతానికి వెళ్లే ముందు అక్కడి కల్చర్, చట్టాలు, ఆచారాలు, ఆ ప్రాంతం సేఫా కాదా అని పరిశీలించాలి. ట్రావెల్ ప్లాన్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవాలి. లగేజీని ఎంత తక్కువ అయితే అంత తక్కువ తీసుకెళ్లాలి. అత్యవసరమైన పరిస్థితి ఎదురైనప్పుడు సహాయం కోరేందుకు కొన్ని నెంబర్లను సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండాలి. కొత్త ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాయం అడిగినా, సమాచారం అడిగినా చేయకూడదు. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో జనం ఎక్కువగా ఉండే సమయంలో ప్రయాణించాలి. రాత్రి ప్రయాణాలు చేయకపోవడం మంచిది వసతి కోసం ఆన్‌లైన్లో మంచి రివ్యూలు ఉన్న హోటల్, లాడ్జి, హాస్టల్‌లో దిగాలి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒంటరి ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలను అందిస్తాయి.
Safety Tips For Women
solo trip
Traveling
జాగ్రత్తలు పాటిస్తే మహిళలు కూడా సోలో ట్రావెలింగ్‌
Scroll for the next article