News28th Jun 03:41 PMSunil Byrisetty1 min read

లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి విన‌తి

ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కలి

లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి విన‌తి
ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కలిసి విన‌తి పత్రం అందించారు. ఈ సందర్భంగా లారీ ఓనర్లు తమకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు — క్రషర్ పరిశ్రమపై ఆధారపడి నడిచే లారీ వ్యాపార పరిస్థితులు, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల వ్యయ భారం, టోల్ గేట్ల వద్ద వేధింపులు, రోడ్ గ్రాంట్లు ఆలస్యం, ఎ.టి.ఎస్. నెంబర్‌ల కారణంగా ఎదురవుతున్న సమస్యలను మంత్రికి విన్నవించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రవాణా రంగాభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ట్రైల‌ర్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ సుర‌ప‌నేని సురేష్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ జాయింట్ సెక్ర‌ట‌రీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Andhra Pradesh
Mandipalli ramprasad reddy
Kesineni Sivanath
Lorry Owners Association
harassment at toll gates
State Transport
ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
Scroll for the next article